English   

మహేష్ బాబుతో లేడీ డైనమిక్ డైరెక్టర్ మూవీ.. 

Sudha Kongara
2021-02-02 15:27:04

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే సర్కారు వారి పాట మూవీ తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేయబోతున్నాడనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.  గురు, ఆకాశమే నీ హద్దురా చిత్రంతో తన సత్తా చాటుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెలుగు హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉందట. 

ఇందులో భాగంగా మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్‌ కోసం ఆమె ఒక సబ్జెక్ట్‌ రెడీ చేశారట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మహేష్ కు మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్ స్క్రిప్ట్ ను త్వరలో వినిపించేందుకు రెడీ అయిందట. ప్రస్తుతం స్క్రిప్ట్కు సుధా తుది మెరుగులు దిద్దుతోంది. దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తయి, మహేశ్‌ హైదరాబాద్‌ తిరిగొచ్చిన తర్వాత సుధ సినిమాకు సంబంధించిన చర్చలు ఫైనల్‌ అవుతాయని ఇండస్ట్రీ టాక్.

More Related Stories