English   

ఆచార్య లో కన్నడ స్టార్‌ సుదీప్‌..

kannada star Sudeep
2021-02-02 15:44:55

ఆచార్యలో హీరో రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు‌. ఈ మూవీ షూటింగ్ లో రామ్ చరణ్ ఇప్పటికే జాయిన్ అయ్యారు. అయితే లేటెస్ట్ గా ఆచార్యలో మరో స్టార్‌ హీరో నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.   చిరంజీవి సైరా నర్సింహరెడ్డి సినిమాలో సుదీప్‌ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలానే ఇప్పుడు 'ఆచార్య'లో సుదీప్ కీలక రోల్ చేస్తున్నాడని రూమర్స్ వినబడుతున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా 'ఆచార్య' సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.  సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ కిచ్లు హీరోయిన్ గా నటిస్తోంది.

More Related Stories