English   

మరో రీమేక్ సినిమాలో మెగాస్టార్

Chiranjeevi
2021-02-02 18:04:06

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం  ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే క్లైమాక్స్ కు చేరింది. చిత్రంలో రామ్ చరణ్  కూడా కీలక పాత్రలో  నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చరణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చరణ్ కు వెల్ కమ్ చెబుతూ సినిమాలో చరణ్ పేరును సిద్ధ గా ప్రకటించింది. ఇక ఈ సినిమాను మే13న విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. 

ఇక ఏ సినిమా పూర్తయ్యాక మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న వేదాళం రీమేక్ లో నటిస్తాడట. ఆ సినిమా తరవాత బాబీ తో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం చిరు మరో రీమేక్ సినిమాపై మనసు పారేసుకున్నాడట. అజిత్ హీరోగా 2015లో వచ్చిన "అరిందాల్" సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. కొణిదెల ప్రొడక్షన్ రైట్స్ ను కూడా సొంతం చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే తెలుగులో "ఎంతవాడు గాని" పేరుతో డబ్ అయ్యింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఈ సినిమాను రీమేక్ చేస్తాడా లేదా చూడాలి. 

More Related Stories