English   

వెంకటేష్ ట్వీట్...నారప్ప షూటింగ్ పూర్తి

Narappa
2021-02-02 18:43:21

విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘అసురన్‌’కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’.  శ్రీకాంత్‌ అడ్డాల  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని హీరో వెంకటేష్ కూడా ట్విట్టర్ లో అభిమానులకు తెలియజేశారు.

''నారప్పతో నా ప్రయాణం నేటితో పూర్తయింది. సినిమా విడుదల కోసం అందరూ వేచి ఉండండి'' అని ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని పోస్ట్ చేశారు.  వెంకటేష్ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ మే 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సమాజంలోని అసమానతలు, చదువు ప్రాముఖ్యతను తెలిపే ఒక పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. 

More Related Stories