English   

ప్రభాస్ ఆదిపురుష్ ఆరంభ్ రోజే అగ్నిప్రమాదం 

 Prabhas Adipurush
2021-02-03 07:22:48

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్టు మంగళవారం ఉదయం ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, షూటింగ్‌ మొదలైన తొలిరోజే ‘ఆదిపురుష్’ సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోయినట్టు తెలిసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలను ఆర్పివేశారు. మంటలను అదుపుచేయడానికి 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదం జరిగిన సమయంలో హీరో ప్రభాస్, విలన్ సైఫ్ అలీఖాన్ సెట్స్ పై లేరు. అయితే విజువల్స్ బట్టి చూస్తే షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది.

More Related Stories