English   

రంగమ్మత్తకు వెల్ కమ్ చెప్పిన ఖిలాడి టీమ్

Anasuya Bhardwaj
2021-02-03 12:17:26

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో "ఖిలాడి" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సినిమాను ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్ లపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ హీరో అర్జున్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల తేదీని కూడాప్రకటించారు. సినిమాను మే 28న విడుదల చేస్తునట్టు స్పష్టం చేసారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా అనసూయకు కిలాడి చిత్ర బృందం వెల్ కమ్ చెప్పింది. చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా రవితేజ తో ఓ స్పెషల్ సాంగ్ లో కూడా దుమ్ములేపుతుందని టాక్. ఇక ఇప్పటికే రంగస్థలం లాంటి సినిమాలో నటించి అలరించిన అనసూయ ఖిలాడి లో ఏమేరకు అలరిస్తుందో చూడాలి. 

More Related Stories