English   

పవన్ కళ్యాణ్.. కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా..

 pawan kalyan
2021-02-03 16:09:07

యాంకర్ ప్రదీప్ హోస్ట్  అండ్ ప్రొడ్యూసర్ గా బుల్లి తెర మీద బాగా ప్రజాదరణ పొందిన టాక్ షో "కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' . త్వరలో సీజన్ 5 స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం.   సీజన్ 5లో గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని తీసుకొని రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడట ప్రదీప్. పవన్ కళ్యాణ్‌ని ఈ షోకి తీసుకుని రావడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నానని.. ఆయన్ని కలిసి ఈ షో గురించి మాట్లాడటం జరిగిందని చెప్పారు. ఒకవైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ టైం చూసుకుని నా షోకి రావడం చాలా గ్రేట్. ఆయన నా షోకి వస్తే బిగ్గెస్ట్ ఎఛీవ్‌మెంట్ అని అన్నారు ప్రదీప్. త్వరలో పవన్ కళ్యాణ్‌ని ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ షోలో చూడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈసారైనా ప్రదీప్ ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి. 

More Related Stories