రవితేజ మాస్ బిర్యాని వీడియో చూశారా..

2021-02-03 16:52:20
మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాలో ‘క్లాస్ కళ్యాణీ.. పెట్టవే మాస్ బిర్యాణీ’ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాటలో రవితేజ, శృతీ హాసన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ తమదైన స్టైల్లో మాస్ స్టెప్పులు వేసిన ఈ పాట అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. రాహుల్ నంబియార్, సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. తనకు ఎంతగానో అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో నటించిన రవితేజ వరుస ఫ్లాఫ్‌ల తర్వాత మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఇక చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శృతీ హాసన్‌కు కూడా ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ మూవీ అయ్యింది.