English   

చిరంజీవి సినిమా రిజెక్ట్ చేసిన నయనతార 

Nayanthara
2021-02-03 17:14:33

మెగాస్టార్‌ చిరంజీవి లూసిఫర్ రీమేక్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే ఈ మూవీలో నటించేందుకు వచ్చిన ఆఫర్ ను నయనతార తిరస్కరించిందట. దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. నయన్‌ రిజెక్ట్‌ చేయడంతో చిత్ర యూనిట్‌ మరో హీరోయిన్‌ వేటలో పడ్డట్టు టాలీవుడ్‌ సర్కిల్‌లో టాక్‌ నడుస్తోంది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్‌పై ఆర్‌బీ చౌదరి.. ఎన్‌వీప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘తని వరువన్’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. చిరంజీవి కెరీర్‌లో లూసిఫర్‌ 153వ చిత్రం.

More Related Stories