English   

రాజేష్ టచ్ రివర్ సైనైడ్ లో హాలీవుడ్ బ్యూటీ

Tannishtha Chatterjee
2021-02-03 17:58:45

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'సైనైడ్'. ఇప్పుడీ సినిమా ప్రధాన తారాగణంతో తనిష్టా ఛటర్జీ కూడా చేరారు. ఈ సినిమాలో  పోలీస్ అధికారిగా ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు సిద్దిఖ్, కన్నడ నటుడు రంగాయన రఘు, తెలుగు నటుడు తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. బుస్సాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి తనిష్టా ఛటర్జీ అవార్డులు అందుకున్నారు. ఆరు సార్లు ఆస్కార్ నామినేషన్లు పొందడంతో పాటు బాప్టా అవార్డులను గెలుచుకున్న ఇరాన్ దర్శకుడు మజీద్ మజీద్ రూపొందించిన 'లయన్', 'బియాండ్ ది క్లౌడ్స్', 'యాంగ్రీ ఇండియన్ గాడ్స్', 'పార్ట్చ్' చిత్రాలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. జర్మన్ చిత్రం 'షాడోస్ ఆఫ్ ది టైమ్స్'లో నటనకు గాను టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తనిష్టా ఛటర్జీని మూడు ప్రధాన అవార్డులు వరించాయి. 

ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్లీ నటించిన 'ఆన్ ఇండియన్' చిత్రంలో కూడా ఆమె నటించారు. 'రోమ్ రోమ్ మెమ్' (2019), 'అన్పోస్టెడ్' (2020) చిత్రాలకు దర్శకత్వం వహించారు. పేరు ప్రఖ్యాతలు గల తనిష్టా 'సైనైడ్'లో నటిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ "తనిష్టా ఛటర్జీ రాకతో మా 'సైనైడ్' టీమ్ మరింత బలపడింది. ఆమె మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు. మరో నిర్మాత కె. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ "ఈ నెల 15న సినిమా ప్రారంభం అవుతుంది. మైసూర్, మంగుళూరు, కేరళలోని పలు ప్రాంతాలలో చిత్రీకరణ చేస్తున్నాం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త స్క్రీన్ ప్లేతో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది" అని అన్నారు.

More Related Stories