English   

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల బరిలోకి రాధిక

 radhika sarath kumar
2021-02-03 18:13:51

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో సినీ నటి రాధిక పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. రాధిక ప్రస్తుతం "సమత్థువ మక్కల్ కట్చి" మహిళ విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ఇప్పటికే రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగటంపై ఆమె భర్త..పార్టీ అధ్యకులు శరత్ కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. దక్షిణ మండలానికి చెందిన నేతల సమావేశంలో శరత్ కుమార్ మాట్లాడుతూ..అన్నాడీఎంకే పార్టీలో తమ పార్టీ కొనసాగుతుందని అన్నారు. అయితే ఈసారి ఒకటి రెండు సీట్లిస్తే సరిపెట్టుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పేసారు. పది సీట్లకు పైగా కేటాయించాలని అన్నా డీఎంకే ను కొరతామని అన్నారు. అంతే కాకుండా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న రాధిక పోటీకి దిగుతారని.. అయితే ఏక్కడ నుండి రాధిక పోటీ చేస్తారనేది తరవాత ప్రకటిస్తామని అన్నారు. ఇక హీరోయిన్ గా రాధిక తెలుగు తమిళ ,మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

More Related Stories