English   

డియర్ మేఘ ఫస్ట్ లుక్...కన్నీళ్ళతో ఆకాష్

Dear Megha
2021-02-04 12:46:39

మేఘా ఆకాష్,అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ''డియర్ మేఘ''. యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రానా దగ్గుబాటి సోషల్ మీడియా లో విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే..... మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది. సినిమాలో మేఘా ఆకాష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు, కథను నడిపే డ్రైవింగ్ ఫోర్స్ గా ఆమె ఫర్మార్మెన్స్ ఉంటుందని అనుకోవచ్చు. ఆమె కన్నీటికి కారణం ఎవరు, ఈ ఉద్వేగ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది "డియర్ మేఘ" సినిమాలో తెలియనుంది."డియర్ మేఘ" సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

More Related Stories