English   

రాజ్ తరుణ్ పవర్ ప్లే..ఒక్క డైలాగ్‌ లేకుండా ట్రైలర్

Raj Tarun POWER PLAY
2021-02-04 13:10:36

హీరో రాజ్‌ తరుణ్ దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా 'పవర్ ప్లే'. ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం విభిన్న కథాంశంతో, క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఒక్క డైలాగ్‌ లేకుండా ఈ ట్రైలర్ ని కట్ చేశారు. రాజ్‌ తరుణ్‌ ఈసారి కూడా హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సీన్‌లో నటించి మరోసారి రెచ్చిపోయాడు.

 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ పవర్‌ ప్లేలో హేమల్‌ ఇంగ్లే కథానాయికగా కనిపించనుండగా పూర్ణ, మధునందన్‌, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మహిదర్ - దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More Related Stories