English   

పూజా హెగ్డేని న్యూడ్ ఫొటో అడిగిన నెటిజన్.. 

Pooja Hedge
2021-02-04 15:04:32

పూజా హెగ్డే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్లుతో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.  ఈ ముద్దుగుమ్మ తనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది.  లేటెస్ట్ గా పూజా హెగ్డే  ఇన్‌స్టాగ్రాములో నెటిజన్స్‌తో కొద్ది సేపు చాట్ చేసింది. ఇక్కడే బుట్టబొమ్మకు షాకింగ్ అనుభవం ఎదురయ్యింది.  ఓ అభిమాని తన న్యూడ్ ఫోటో పెట్టాలంటూ కామెంట్ చేశాడు. దీనికి పూజా అదిరిపోయే రేంజులో కౌంటర్ ఇచ్చింది. తన పాదాలను ఫోటో తీసి పోస్ట్ చేసింది. ఇది చూసి సదరు అభిమాని కంగుతిన్నాడు. కాగా, ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఈ ఫోటో కంటే ముందు అభిమానులతో ఆసక్తికర ఫోటోలను పంచుకుంది పూజా హెగ్డే. ఓ నెటిజ‌న్ పూల్‌లో ఉన్న ఫొటోని షేర్ చేయ‌మ‌న‌గా, పూల బికినితో ఉన్న ఫొటో షేర్ చేసింది. ఇక మ‌రో నెటిజ‌న్ అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోని షేర్ చేయ‌మ‌న‌గా, ఆయ‌న త‌న‌యుడు అభ‌య్ రామ్‌తో క‌లిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్‌, ఆచార్య, మోస్ట్‌ ఎలిబిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాల్లో పని చేస్తూ.. ఫుల్‌ బిజీగా ఉన్నారు. 
 

More Related Stories