English   

ఎస్ఆర్ కళ్యాణమండపం టీజర్.. హిట్టు కొట్టేలా ఉన్నారు

SR Kalyanamandapam Teaser
2021-02-04 16:02:35

రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం ప్రియాంకా జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ఎస్ ఆర్ కల్యాణమండపం. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు. ” ఏ అన్నో మీకు గర్ల్ ఫ్రెండ్ లేరా..? లేక వాళ్లకు నడుములు లేవా ..? ప్రతి ఒక్కడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుముతోనేనా పంచాయితీ అంటూ హీరో చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది.

ఇందులో విలక్షణ నటుడు సాయి కుమార్ - తనికెళ్ల భరణి - తులసి - శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు 'చూసాలే కళ్లారా..' 'చుక్కల చున్నీనే' సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్రనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.   

More Related Stories