English   

రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్

RGV Disha
2021-02-05 01:13:09

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలు తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ సమయంలో వర్మ చక చకా సినిమాలు అనౌన్స్ చేయడం..షూటింగ్ పూర్తి చేసి తన ఓటీటీ లో విడుదల చేయడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఇక వర్మ తెరకెక్కించిన మరో వివాదాస్పద చిత్రం "దిశ ఎన్కౌంటర్". ఈ సినిమాను ఆర్జీవి హైదరాబాద్ శివారులో జరిగిన యాథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను దిశ హత్యాచార నిందితుల ఆధారంగా తెరకెక్కించారని..సినిమా విడుదలైతే ఊర్లో తమకు ఉన్న గౌరవం పోతుందని నిందితుల కుటుంబీకులు కోర్టును ఆశ్రయించారు. 

మరోవైపు దిశ కుటుంబ సభ్యులు కూడా సినిమాను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు తీర్పు ఆర్జీవి కి అనుకూలంగా రావడంతో సినిమా సెన్సార్ వరకు వెళ్లింది. అయితే తాజాగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకు బ్రేకులు వేసింది. సినిమాలో దిశ ఎన్కౌంటర్ సమయంలో జరిగిన నిజ సన్నివేశం ఆధారంగా సీన్లు ఉన్నాయని సినిమాకు సెన్సార్ ఇవ్వలేదుము దాంతో ఈ సినిమా ను రివిజన్ కమిటీ ముందుకు తీసుకువెళ్లారు. మరి రివిజన్ కమిటీ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

More Related Stories