English   

ప్రభాస్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్...రాధే శ్యామ్ టీజర్ పై అప్డేట్

 Radhe Shyam
2021-02-04 18:49:28

ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా "రాధే శ్యామ్". ఈ సినిమాకు గోపిచంద్ తో "జిల్" తెరకెక్కించిన రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం పిరియాడికల్ ప్రేమ కథ పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టీజర్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసే అవకాశం ఉందని ప్రముఖ మూవీ క్రిటిక్ సుమిత్ కాడెల్ వెల్లడించారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్ టీజర్ యాష్ టాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. ఇక ఈ చిత్రం రొమాంటిక్ ప్రేమ కథా చిత్రమని సుమిత్ ట్వీట్ లో తెలిపారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి..లేదా రెండో వారంలో షూటింగ్ పాక్ అప్ చెప్పే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. అంతే కాకుండా ఇప్పటికే సినిమాలో పూజ హెగ్డే కు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయ్యిందట.

More Related Stories