English   

గోవా లో రచ్చ చేస్తున్న హాట్ యాంకర్స్

Sreemukhi
2021-02-05 11:53:08

తెలుగు లో క్రేజీ యాంకర్ గా పాపులర్  శ్రీముఖి ప్రస్తుతం టీవీషోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. శ్రీముఖి "పటాస్" షోలో యాంకర్ రవితో రచ్చ చేసి ఎక్కువగా  గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత తెలుగులో తిరుగులేని యాంకర్ గా ఎదిగింది. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చబ్బీ బ్యూటీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అల్లరి పిల్ల మాత్రమే కాకుండా...సూటిగా మాట్లాడే శ్రీముఖికి అభిమానులు ఫిదా అయ్యారు. దాంతో ఈ అమ్మడు రన్నరప్ గా నిలవగా రాహుల్ సిప్లింగజ్ టైటిల్ గెలుచుకున్నాడు..అయినప్పటికి శ్రీముఖి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. బిగ్ బాస్ నుండి భయటకు వచ్చాక శ్రీముఖి మరింత బిజీ అయ్యింది. 

ఇక ఈ భామ ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూ పర్సనల్ విషయాలతో పాటు తన ప్రాజెక్టు గూరించి కూడా పంచుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీముఖి గోవా వెళ్ళింది. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో పోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. శ్రీముఖి తో పాటూ ఆర్జే చైతు, యాంకర్ విష్ణు ప్రియా కూడా గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి ఉన్న పోటోలను వీడియోలను శ్రీముఖి అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక శ్రీముఖి కీలక పాత్రలో నటించిన "క్రేజీ అంకుల్స్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

More Related Stories