English   

సినీ ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

 Telangana
2021-02-05 12:29:51

సినీప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్సులకు 100 శాతం సీటింగ్ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో థియేటర్లకు వందశాతం సీటింగ్ కు అనుతిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ 100 శాతం సీటింగ్ కు అనుమతి ఇచ్చింది. ఇక కేంద్రం థియేటర్లు, మల్టిప్లెక్సుల్లో ఖచ్చితంగా ప్రతిరోజు సానిటైజేషన్ చేయాలని పేర్కొంది. అంతే కాకుండా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. టికెట్ కౌంటర్ ను ప్రతి రోజు శుభ్రం చేయాలని పేర్కొంది. అంతే కాకుండా బ్రేక్ టైమ్ లో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రేక్షకులతో పాటు. నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే పలు పెద్ద, చిన్న సినిమాలు విడుదల తేదీని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోల సినిమాలను థియేటర్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా 50 శాతం సీటింగ్ తోనే వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు వంద శాతం సీటింగ్ కు పర్మిషన్ ఇవ్వడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించనుంది.

More Related Stories