English   

సోషల్ మీడియాలో వేధింపులు...పోలీసులను ఆశ్రయించిన మాధవీలత

Actress Madhavi Latha
2021-02-05 17:38:24

ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు మాధవీ లత పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని..అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ ను కలిసి విజ్ఞప్తి చేసింది. మొదటి నుండి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని పేర్కొంది. దేవాలయాల గురించి మాట్లాడినప్పటినుండి వేధింపులు ఎక్కువ అయ్యాయని తెలిపింది. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టు బడితే అందులో తను కూడా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇలాంటి అభ్యంతకర పరిస్థితితులు కల్పిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్టు మాధవీలత వెల్లడించింది. పోలీసులు వారిని పట్టుకోక పోతే మౌన దీక్షకు దిగితానని హెచ్చరించింది. ఇక మాధవీ లత నచ్చావులే, స్నేహితుడా, మిథునం సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం ఈ భామ ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటూ సినిమాలు కూడా చేస్తోంది.

More Related Stories