English   

శ్రీకారం మూవీ టీజర్ డేట్ వచ్చేసింది 

 Sreekaram
2021-02-05 18:49:03

హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. ఈ  సినిమాలో రైతుగా కనిపించనున్నాడు ఈ యంగ్ హీరో. వాస్తావ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది.  శ్రీకారం మూవీ టీజర్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్టు  పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్ . అలాగే  ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన శ్రీకారం మూవీని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 11న విడుదల చేసేందుకు మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. ఈ మేరకు మూవీ యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. శ్రీకారంలో శర్వా కి జోడీగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీజేమేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు విశేష స్పందన లభించింది.

More Related Stories