English   

రాధే శ్యామ్ నుండి సర్ప్రైజింగ్ వీడియో

Prabhas Radhe Shyam
2021-02-06 10:57:44

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న పిరియాడికల్ ప్రేమ కథ చిత్రం "రాధే శ్యామ్". ఈ సినిమాను జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూర్వ జన్మల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా నటిస్తుండగా..పూజ హెగ్డే ప్రేరణ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో సినిమా టీజర్ కోసం అభిమానులు వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ సినిమా టీజర్ అప్డేట్ ను ఇస్తూ ఓ సర్ప్రైజింగ్ విడియో ను వదిలింది. ఈ వీడియోలో ప్రేమకు విట్ నెస్ గా వాలెంటైన్స్ డే ఉంటుందని తెలుపుతూ వాలెంటైన్స్ డే రోజు టీజర్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. టీజర్ రాగానే ట్రెండ్ చేస్తామని ఊపు మీద ఉన్నారు. ఇక ఈరోజు వదిలిన వీడియో క్లాస్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటోంది. సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగాన్ని ఇటలీలో షూట్ చేశారు.

More Related Stories