English   

న‌రేష్ నాంది ట్రైలర్..చట్టాలు చేతకాని వాడి మీద వాడటానికే

Allari Naresh
2021-02-06 12:40:37

గత కొన్నాళ్లుగా హీరోగా ప్లాప్ లతో సతమతమవుతున్న అల్లరి న‌రేష్, త్వరలో నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  అల్లరి న‌రేష్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన 'నాంది'  ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 'నాంది' ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. నరేష్ కూడా అదరగొట్టాడు.  'ఇక్కడ చట్టాలు చేతకాని వాడి మీద వాడటానికే.. అధికారంలో ఉన్నవాడిని ఏమి చేయలేవు' అనే డైలాగ్ అదిరిపోయిందనే చెప్పాలి. చేయని హత్య వల్ల శిక్ష అనుభవిస్తోన్న నరేష్, ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ముఖ్య కథగా తెలుస్తోంది.  ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా క‌నిపించ‌నుంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

More Related Stories