English   

డ్రంక్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ్డ జ‌బ‌ర్ధ‌‌స్త్ క‌మెడీయ‌న్

Jabardasth Tanmay
2021-02-06 13:16:38

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఐతే జూబ్లిహిల్స్‌లో చేసిన తనిఖీల్లో జబర్దస్త్‌ కమెడియన్ తన్మయ్ పోలీసులకు పట్టుబడ్డాడు. మందు తాగి వాహనం నడుపుతున్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇత‌నితో కొంద‌రు ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్ ఉండ‌గా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. తన్మయ్ చాలా కాలంగా జబర్దస్త్‌లో చేస్తున్నాడు. ఐతే ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తుంటాడు. జబర్దస్త్‌ షో తరువాత  నాగబాబు అదిరింది షోకి తన్మయ్ కూడా షిఫ్ట్ అయ్యాడు.  ప్రస్తుతం అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

More Related Stories