English   

నాని దర్శకుడి చేతుల మీదుగా మెరిసే మెరిసే టీజర్ రిలీజ్

  Dinesh Tej
2021-02-06 17:39:35

హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా పవన్ కుమార్ కె.దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మెరిసే మెరిసే. వెంకటేష్ కొత్తూరి నిర్మాత. తాజాగా ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్‌ శివ నిర్వాణ స్పందిస్తూ.. 'మెరిసే మెరిసే' టీజర్‌ చూశాను. చక్కటి విజువల్స్‌తో చాలా కూల్‌గా ఉంది. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో హీరో దినేష్‌ తేజ్‌, హీరోయిన్‌ శ్వేతా అవస్తి తమదైన మార్కుని క్రియేట్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ తొలి చిత్రమే అయినా సినిమాను చక్కగా తెరకెక్కించాడని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. కచ్చితంగా 'మెరిసే మెరిసే' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను" అన్నారు.

ఈ టీజర్‌లో యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చూపించారు.లవ్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలతో కూడిన కథను 'మెరిసే మెరిసే' రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ చిత్రంలో శ్వేతా అవస్తి హీరోయిన్‌గా నటిస్తోంది. 

More Related Stories