English   

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా ఇప్పుడు ఇలా ఉందట

Actress Meena
2021-02-06 17:50:14

సినీపరిశ్రమలో ఒకరు వద్దని చెప్పిన పాత్రలు చేసి మరొకరు స్టార్ లుగా మారటం చాలా సందర్భాల్లోనే చూస్తుంటాం. దాన్నే లక్ అని కూడా అంటారు. ప్రముఖ నటి ప్రస్తుతం బుల్లి తెరపై అలరిస్తున్న రోజా సెల్వా మణికి  కూడా అలాంటి అదృష్టమే దక్కిందట. రోజా రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ప్రేమ తపస్సు సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తరవాత రోజాకు అవకాశాలు లేక ఖాళీగా ఉండేదట. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్..సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ బాబు హీరోగా సర్పయాగం సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమాలో మీనాను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారట. 

అయితే అప్పటికే మీనా "సీతారామయ్య మనవరాలు" సినిమాతో సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాగా సర్పయాగం సినిమాలో శోభన్ బాబు చనిపోయే సీన్ ఉంటుంది. దాంతో ఆ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మీనాను ఆ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అని క్యాన్సిల్ చేశారట. ఆతరవత హీరోయిన్ కోసం వెతుకుతుందడగా ఎంపీ శివప్రసాద్ తాను దర్శకత్వం వహించిన సినిమా చూడాలని పరుచూరి బ్రదర్స్ కు సలహా ఇచ్చారట. ఇక ఆ సినిమాలో రోజా నటనకు ఫిదా అయ్యిన పరుచూరి బ్రదర్స్ సర్పయాగం సినిమాలో రోజాను హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఇంకేముంది ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి రోజా టాప్ హీరోల కళ్ళలో పడింది. దాంతో ఇండస్ట్రీలో బిజీ నటిగా మారిపోయింది.

More Related Stories