English   

అల్లు అర్జున్ క్యారవాన్ కు యాక్సిడెంట్

Allu Arjun
2021-02-06 18:08:01

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం షూటింగ్ ను అడవుల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ ను ఏపీలోని రాంచోడవరం లో కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. కాగా షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ తిరిగి వస్తుండగా అల్లు అర్జున్ క్యారవాన్ కు యాక్సిడెంట్ జరిగింది. అల్లు అర్జున్ క్యారవాన్ ను వెనకనుండి మరో క్యారవాన్ ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. అయితే దానికి ముందే అల్లు అర్జున్ రాజమండ్రి నుండి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. యాక్సిడెంట్ కు గురైన క్యారవాన్ లో అల్లు అర్జున్ మేకప్ సిబ్బంది ఉన్నారు. ఖమ్మం సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ప్రమాదం పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Related Stories