పవన్ తో సినిమాపై ఇస్మార్ట్ బ్యూటీ క్లారిటీ

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే నిధి అగర్వాల్ కుర్రకారు మనసు దోచేసింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ భామకు ఇస్మార్ట్ బ్యూటీ అని పేరు వచ్చింది. దాంతో ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాకుండా పవర్ స్టార్ ఒక్కనే నటించే ఛాన్స్ దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరవాత ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలను త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
వాటిలో ఒకటి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పవన్ లుక్ ను కూడా విడుదల చేసారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ సరసన జాక్వెలిన్ ఫర్నేఅండ్జ్, నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ హీరోయిన్ లు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా తాజాగా పవన్ సినిమాలో నటిస్తున్నట్టు నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. పిఎస్పీకె 27 లో నటిస్తున్నట్టు చెప్పడమే కాకుండా పవన్ ను పొగడ్తలతో ముంచెత్తింది. పవర్ ఫుల్ ప్రాజెక్టు లో భాగం అవ్వడం అదృష్టం అని చెప్పింది. ఇస్మార్ట్ బ్యూటీ.