English   

స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్

Actor Suriya
2021-02-08 12:06:54

తమిళ స్టార్ హీరో సూర్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన  స్వయంగా అభిమానులకు తెలియజేశారు.  ఆదివారం రాత్రి ట్వీట్ చేసిన సూర్య.. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను. మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలి. భయంతో వణికిపోకూడదు. అలా అని భద్రత, జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదు. నాకు వైద్యం అందిస్తోన్న వైద్యులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సూర్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సూర్య ప్రస్తుతం తన 40వ సినిమాతో బిజీగా ఉన్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

More Related Stories