English   

అనసూయను పచ్చిగా దూషించిన నెటిజెన్..తన స్టైల్ రీప్లే ఇచ్చిన బ్యూటీ

Anasuya
2021-02-08 13:50:24

జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో బిజీగా వుంది. ఇక టైం దోరికినప్పుడల్లా సోషల్ మీడియాలోనూ అనసూయ అభిమానుతో కూడా సరదాగా ముచ్చటిస్తుంది. ఇక ఈ అమ్మడిపై ట్రోల్స్ కూడా గట్టిగానే వస్తుంటాయి. అలాంటి ట్రోల్స్ ను చాలా సార్లు లెక్క చేయదు కానీ కొన్ని సార్లు తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. ఇక తాజాగా అలాగే ఓ నెటిజెన్ పచ్చిగా దూషిస్తూ ఓ పోస్ట్ చేసాడు. అనసూయ మూడేళ్ళ క్రితం ఒక కార్యక్రమంలో స్టేజ్ పై కళ్ళు తిరిగి పడిపోయిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ ఫొటోకు అనసూయ అటెన్షన్ కోసమే అనసూయ ఇలా పడిపోయినట్టు నటించిందని కామెంట్ చేసాడు. ఇక ఆ పోస్ట్ పై అనసూయ ఘాటుగానే స్పందించింది. "మూడేళ్ళ క్రితం వీడియోను పట్టుకుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్. నేను అప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. అందుకే నాకు లో బీపీ అయ్యింది. అందువల్లే పడిపోయాను. అప్పుడు టైమ్ ఉదయం 5:30 ..ఆగకుండా 22 గంటలు షూట్ చేసాము. అందువల్లే నీరసం వచ్చి పడిపోయాను. నువ్వు అనుకున్నట్టు ఎవరి అటెన్షన్ కోసమో కాదు" అంటూ అనసూయ రీప్లే ఇచ్చింది.

More Related Stories