English   

స్లిమ్ లుక్ లో మాయ చేస్తున్న తమ‌న్నా  

Tamannaah Bhatia
2021-02-08 14:50:36

కరోనా టైమ్ లో బొద్దుగా మారిన తమ‌న్నా స్లిమ్‌గా మారేందుకు జిమ్‌లో నానా క‌ష్టాలు ప‌డుతుంది. వ‌ర్కవ‌ట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. రీసెంట్‌గా బ్లాక్ ప్యాంట్, రెడ్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన త‌మ‌న్నా హాట్ లుక్స్‌తో హీటెక్కిస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ.. చెమటోడుస్తోన్న ఫోటోను ఒక దాన్ని పోస్ట్ చేసింది. అంతేకాదు మన శరీరాకృతి ఎలా ఉండాలో మన మైండ్ సెట్ చేస్తోంది. దానికి తగ్గట్టు కష్టపడితే.. అందమైన శరీరాకృతి మన వశం అవుతోంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా..  గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సీటీమార్' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఏప్రిల్‌లో 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో అలరించనుంది.  దాంతో పాటు నితిన్ సినిమా ‘అంధాదున్’ రీమేక్‌లో  కొంత బోల్డ్ పాత్రలో నటించబోతుంది. మరోవైపు ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది.

More Related Stories