English   

పవన్ కళ్యాణ్ సినిమాలో వివి వినాయక్ 

Vinayak
2021-02-08 18:01:42

మలయాళీ సూపర్‌హిట్‌  'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' ఆధారంగా ప‌వన్ క‌ళ్యాణ్, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ మల్టీస్టారర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ అతిథి పాత్ర కోసం వినాయ‌క్ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ రీమేక్ లో కీలకమైన గెస్ట్ పాత్రలో వినాయక్ అయితే బాగుంటాడు అని యూనిట్ సభ్యులు అన్నారట. పవన్ కూడా ఆ పాత్రకు వినాయక్ సూట్ అవుతాడని భావించి ఓకే చెప్పడం జరిగిందట. కాని మీడియా వర్గాల్లో మాత్రం ఈ రీమేక్ లో వినాయక్ పాత్ర గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పవన్ రానాల మూవీలో వినాయక్ ఉన్నాడని మాత్రం బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భాగమయ్యారు. ఈ చిత్రానికి ఆయన మాటల రచయితగా వ్యవహరించనున్నారు. 

More Related Stories