English   

షూటింగ్ సెట్స్ లో స్పృహ తప్పి పడిపోయిన ఉప్పెన హీరోయిన్

Uppena
2021-02-08 18:16:26

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఉప్పెన. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ లో బుచ్చిబాబు సన తెరకెక్కించారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా క్రితి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ భామ మొదటి సినిమాతోనే తెగ పాపులర్ అయ్యింది. సినిమాలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్ లో సెన్సేషనల్ అవ్వడంతో నటి నటులు ఇద్దరు సినిమా విడుదలకు ముందే భాగా పరిచయం ఉన్న నటుల్లా మారిపోయారు. ఇక ట్రైలర్ లో, పాటల్లో క్రితి ఎక్స్ ప్రెషన్స్ కు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దర్శకులు కూడా ఫిదా అయ్యారట. 

దాంతో ఇప్పటికె ఈ అమ్మడికి పలు క్రేజీ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మెగా స్టార్ కూడా క్రితి శెట్టి నటనకు ఫిదా అయ్యానని..ఈ అమ్మాయి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందని వెంటనే దర్శకులు బుక్ చేసుకోవాలని చెప్పారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ..సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్ ఉప్పాడలో జరిగిందని చెప్పారు. అయితే సముద్రం పక్కనే ఉండటం తో అక్కడ వాతావరణానికి అలవాటు పడటానికి తమకు చాలానే టైమ్ పట్టిందని తెలిపాడు. చాలా మందికి జ్వరం వచ్చిందని హీరోయిన్ కృతి శెట్టి అయితే జ్వరంతో వణుకుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పాడు.
 

More Related Stories