English   

రెండో భార్య కోసం దిల్ రాజు అదిరిపోయే గిఫ్ట్..కూతురికి నచ్చుతుందా

Dil Raju
2021-02-10 12:22:01

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకరు దిల్ రాజు. ఆయన మొదటి సినిమా "దిల్" నే తన ఇంటిపేరుగా మార్చుకుని ఇండస్ట్రీలో ఎదిగారు. ఓ వైపు డిట్రిబ్యూటర్ గా మరోవైపు నిర్మాతగా ఇండస్ట్రీలో దిల్ రాజు రాణిస్తున్నారు. కాగా దిల్ రాజ్ సినిమా లైఫ్ పక్కన పెడితే ఆయన భార్య అనిత అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల క్రితం మరణించారు. వీరిద్దరికి ఒక కూతురు ఉండగా ఆమె పెళ్లిని ఘనంగా జరిపించారు. కాగా మొదటి భార్య చనిపోయిన తరువాత చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న  దిల్ రాజు లాక్ డౌన్ సమయంలో తేజశ్విని అనే ఎయిర్ హోస్టెస్ ను రెండోపెళ్లి చేసుకున్నారు. కరోనా టైమ్ కావడంతో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరిపెళ్లి జరిగింది. దాంతో అత్యంత సన్నిహితులు తప్ప పెళ్లికి ఎవరూ హాజరవ్వలేదు. 

కాగా పెళ్లి తరవాత తన 50వ పుట్టిన రోజుకు దిల్ రాజు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను హీరోలను ఆహ్వానించి తన భార్యను పరిచయం చేసారు. ఇక పెళ్లి తరవాత వీరిద్దరి ఫోటోలు సెల్ఫీలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా దిల్ రాజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన బ్యానర్ లో నిర్మించిన సినిమాలకు టైటిల్ లో దిల్ రాజు సమర్పణలో..లేదంటే మొదటి భార్య పేరుతో అనిత సమర్పణలో అని వేసేవారు. కానీ ఇప్పుడు తేజశ్విని సమర్పణలో అని వేయబోతునట్టు తెలుస్తోంది. అయితే సాధారణంగా ఎవరికైనా మదర్ సెంటిమెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తన తల్లి పేరును తొలగించి పిన్ని పేరు వేయడం దిల్ రాజు కూతురుకు నచ్చుతుందా.? అన్న ప్రశ్న మొదలయ్యింది.

More Related Stories