English   

ఆఫ్రికన్ జంగల్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ జక్కన్న సినిమా

Mahesh Rajamouli
2021-02-11 16:36:55

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాపై కొన్ని ఆసక్తికర విషయాలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే రాజమౌళి ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాను అడవుల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారట. అయితే దానికోసం విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఆఫ్రికన్ అడవులను కూడా సదర్శించినట్టు తెలుస్తోంది. 

ఈ సినిమాను రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలకంటే బిన్నంగా భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కించనున్నట్టు కూడా సమాచారం. ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి  తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తవగానే జగ్గన్న మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారట. ఇక జక్కన సినిమా మొదలు పెడితే మళ్లీ గ్యాప్ దొరకదు కాబట్టి మహేష్ బాబు కూడా అప్పటివరకూ తన ప్రాజెక్టు లను పూర్తిచేసుకుంటారట. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

More Related Stories