English   

నాగార్జున ను కలిసిన అఖిల్..కారణం ఇదే

Akhil Sarthak
2021-02-11 16:51:59

బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అఖిల్ సార్ధక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. హౌస్ లో అఖిల్ మోనాల్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చడం తో వీరికి చాలామంది అభిమానులు అయ్యారు. దాంతో అఖిల్ బిగ్ బాస్ సీజన్ లోనే రన్నరప్ గా నిలిచారు. అంతే కాకుండా బిగ్ బాస్ కి ముందు అఖిల్ సార్ధక్ అంటే అసలు ఎవ్వరికీ తెలియదు..కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక అఖిల్ అంటే తెలియని టీవీ ప్రేక్షకులు లేరు. ఇదిలా ఉండగా అఖిల్ తాజాగా హోస్ట్ నాగార్జున ను కలిశారు. అఖిల్ తో పాటు ఆమె తల్లి కూడా నాగార్జున ను కలిసి మాట్లాడారు. 

ఈ ఫోటోలను అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..అసలు అఖిల్ నాగార్జునను ఎందుకు కలిశారు..అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే హౌస్ లో ఉన్నప్పుడు అఖిల్ నాగార్జున తో మాట్లాడుతూ తాను ఒక బిజినెస్ పెట్టబోతున్నానని..ఆ బిజినెస్ ఓపెనింగ్ కు రావాలని కోరారు. దాంతో నాగార్జున ఒకే చెప్పారు. అయితే ఇప్పుడు అదే విషయమై అఖిల్ తన తల్లితో కలిసి నాగ్ ను కలిసేందుకు వెళ్లి ఉంటాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అఖిల్ మాత్రం విషయం ఎంటో చెప్పకపోవడంతో ఎవరి ఊహలకు తగట్టు వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. మరి అసలు విషయం ఎంటో అఖిల్ భయట పెడితేనే తెలుస్తుంది.

More Related Stories