ఇంత సెక్సీగా బుక్ చదివితే తట్టుకోవడం కష్టమే అనూ..

అను ఇమ్మాన్యుయేల్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటించింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం బాగానే తెచ్చుకుంది. దానికి కారణం పెద్ద సినిమాలు. పవర్ స్టార్.. స్టైలిష్ స్టార్ లాంటి సూపర్ స్టార్స్ తో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే పవర్ స్టార్ హ్యాండిచ్చాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా అదే చేసాడు. నా పేరు సూర్య కోసం అందాలన్నీ ఆరబోసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక ఆ తర్వాత శైలజారెడ్డి అల్లుడు అంటూ వచ్చింది. ఆ సినిమా కూడా అంతే సంగతులు. దాంతో ఫ్లాపుల హీరోయిన్ గా ఈమెను ముద్ర వేసారు. దాంతో అవకాశాలు కూడా కరువైపోయాయి. దాంతో పాటు ఈమె బాగా బరువైపోయింది. అందుకే ఆఫర్లు కూడా కనుచూపు మేరల్లోనే ఆగిపోయాయి.
తమిళనాట కూడా ఒకట్రెండు సినిమాలకే దూరం పెట్టేసారు. దాంతో బరువు తగ్గి హాట్ షో చేస్తుంది అను. ఈ మధ్యే అల్లుడు అదుర్స్ అంటూ వచ్చింది. కానీ ఈమె అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయ్ అంత ఉంది. అందుకే అల్లుడు కూడా దారుణంగా హ్యాండిచ్చాడు. అందుకే ఇప్పుడు చేసేదేం లేక హాట్ షో చేస్తుంది. తాజాగా ఈమె ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మడు కాలు మీద కాలేసుకుని సెక్సీగా లెగ్స్ చూపిస్తూ శ్రద్ధగా బుక్ చదువుతుంది. ఇంత సెక్సీగా పుస్తకం చదివితే నీ నాలెడ్జ్ పెరగడమేమో కానీ నీ షోతో మా మతులు చెడిపోతున్నాయి అంటున్నారు కుర్రాళ్లు. మొత్తానికి అందాలు ఆరబోసినా కూడా ఈమెకు ఆఫర్లు వస్తాయనే క్లారిటీ మాత్రం రాలేదు.