English   

పోస్టల్ స్టాంప్ పై అనసూయ ఫోటోలు

 Anasuya
2021-02-11 18:39:33

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం అనసూయను సొంత పోస్టల్ స్టాంప్ తో సత్కరించింది. పోస్టల్ స్టాంప్ పై అనసూయ ఫోటో పడటం అంటే ఆమెకు గొప్ప గుర్తింపు లభించినట్టే. ఈ ఏడాది మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తేజకరమైన మహిళల కథలను భయటికి తెస్తోంది.ఈ నేపథ్యంలోనే అనసూయను పోస్టల్ స్టాంప్ తో సత్కరించింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్  మీడియాలో అభిమానులతో పంచుకుని సంబురపడింది. అసలు ఇంత గొప్ప గౌరవం తనకు దక్కుంతుందా అని ఆశ్చర్యపోయింది. ఇదిలా ఉండగా జబర్దస్త్ షోతో టాలీవుడ్ లో అభిమానులను సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయింది. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. రంగస్థలం, క్షణం లాంటి సినిమాల్లో నటించిన అనసూయ తన నటనతో ప్రేక్షకులను కట్టపడేసింది. దాంతో ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక అనసూయ మెయిన్ రోల్ లో నటించిన ఒకే బ్రదర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More Related Stories