English   

ఇల్లందులో ఆచార్య షూటింగ్..బొగ్గు గనుల్లో కీలక సన్నివేశాలు

 Acharya
2021-02-12 16:34:24

మెగాస్టార్ చిరంజీవి , క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా "ఆచార్య". ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో చరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ స్పష్టం చేసింది.  అంతే కాకుండా ఒక ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో చరణ్ నటిస్తున్నట్టు కొరటాల వెల్లడించారు. ఇక ఇంతకాలం సినిమా షూటింగ్ ను ధర్మస్థలి పేరుతో ఒక భారీ సెట్ ఏర్పాటు చేసి చిత్రీకరించారు. ఇక ఇప్పుడు కొన్ని కీలక సన్నివేషాలను చిత్రించేందుకు ఆచార్య టీమ్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందుకు వెళ్లబోతుంది. అక్కడ రామ్ చరణ్, చిరంజీవి పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. 

ఈ సన్నివేశాలను ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల్లో చిత్రించనున్నారు. దానికోసం దర్శకుడు కొరటాల ఇప్పటికే మైన్ ను సందర్శించారు కూడా. ఇక షూటింగ్ అనుమతి కోసం కొరటాల శివ ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ ని మర్యాద పూర్వకంగా కలిసి ముచ్చటించారు. కాగా షూటింగ్ కు అనుమతి ఇవ్వడమే కాకుండా చిరంజీవికి తమ ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తామని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ఇక కొద్దిరోజుల క్రితం పువ్వాడ అజయ్ ఆచార్య షూటింగ్ సెట్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తుంటే కొరటాల శివతో పువ్వాడ అజయ్ కి మంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

More Related Stories