English   

శంకర్ తో సినిమాపై మెగా అప్డేట్..ఫ్యాన్స్ కి పండగే

Ram charan
2021-02-12 18:23:50

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తరవాత సినిమాను ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై రామ్ చరణ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. చరణ్ తాను శంకర్ దర్సకత్వంలో సినిమా చేయడం ఎక్సయిటింగ్ గా ఉందని...ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు నిర్మించబోతున్నారని స్పష్టం చేశాడు. ఇక ప్రస్తుతం చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తరవాత శంకర్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నతున్నారు. ఇక శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో జరిగిన క్రేన్ ప్రమాదం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి వార్తలు రాలేదు. ఇది ఇలా ఉంటే రజినీకాంత్ తో తీసిన రోబో సినిమా తరువాత శంకర్ కు హిట్ కూడా లేదు. రోబో తరవాత ఐ, స్నేహితుడు సినిమాలు తియ్యగా ఐ కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇక బాలీవుడ్ సినిమా "3 ఈడియట్స్" కు రీమేక్ గా తెరకెక్కించిన స్నేహితుడు సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. అప్పటికే 3 ఇడియట్స్ సినిమాను ప్రేక్షకులు చూడటంతో స్నేహితుడు సినిమాకు ఆదరణ కరువయ్యిందని. దాంతో రోబో తరవాత మళ్లీ శంకర్ అంత పెద్ద హిట్ ఇవ్వలేదు. ఇక ఈసారి చరణ్ తో రోబో రికార్డులు బ్రేక్ చేస్తాడా లేదా చూడాలి.

More Related Stories