English   

అయోధ్య మందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ నిర్మాతల భారీ విరాళం

Pawan Kalyan
2021-02-13 08:43:15

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణానికి దేశం నలుమూలల నుండి విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మందిర నిర్మాణానికి సాధారణ ప్రజలు, రాజకీయ నాయకుల తో పాటు  సెలబ్రెటీలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి మొదటగా హీరో అక్షయ్ కుమార్ విరాళం ఇచ్చి అంతా రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఇక నటీమణుల్లో ప్రణీత విరాలమిచ్చిన మొదటి హీరోయిన్ గా నిలిచింది. 

ఇక టాలీవుడ్ నుండి కూడా పెద్ద ఎత్తున విరళలాలని అందజేస్తున్నారు. టాలీవుడ్ నుండి మొదట జనసేనాని పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలను తిరుపతిలో రమమందిర నిర్మాణ ట్రస్ట్ సభ్యులకు అందజేసారు. మా ఛైర్మెన్ నరేష్  కూడా తన వంతు విరాళాన్ని అందజేశారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మిస్తున్న ఐదుగురు ప్రొడ్యూసర్ లు విరళలాలని అందజేశారు. నిర్మాతలు దిల్ రాజు, ఎమ్ రత్నం, శ్రీ ఎస్ రాధాకృష్ణ, నవీన్ ఎర్నేని, బండ్లగణేష్ సంయుక్తంగా మొత్తం 54.51 లక్షలను విరాళంగా ఇచ్చారు. నిర్మాతలు తమ హీరో పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ విరాళాన్ని అందజేశారు. ఇక ఈ విరాళాన్ని నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో కలిసి హైదరాబాద్ ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీదేవేందర్ గారికి చెక్కు రూపంలో అందజేశారు.

More Related Stories