English   

జాతిరత్నాలు టీజర్..ఆధ్యంతం వినోదమే

Jathi Ratnalu
2021-02-13 15:50:11

నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా " జాతి రత్నాలు". ఈ సినిమాలో ఇప్పటికే కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను మహానటి సినిమాకు దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. 65 సెకన్ల నిడివి  ఉన్న ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమాలో ముగ్గురూ కలిసి నవ్వులు పూయించబోతున్నారని అర్థం అవుతోంది. 

ఈ సినిమా ఫుల్ లెన్త్ కామెడీ డ్రామాగా తెరకెకుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా టీజర్ ను అన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ వినోదబరితమైన చిత్రాన్ని శివరాత్రి కానుకగా మార్చ్ 11న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా నవీన్ పొలిశెట్టి "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ" సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాహుల్ ఇప్పటికే మంచి కమెడియన్ గా ఫేమస్ అవ్వగా...ప్రియదర్శి అటు కామెడీ ఇటు సెంటిమెంట్ ఏదైనా తనదైన స్టైల్ లో చేస్తూ నటుడి గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

More Related Stories