English   

శ్రీముఖి ప్రియుడిని పరిచయం చేయబోతుందా

Sreemukhi
2021-02-13 08:57:43

టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న యాంకర్ లలో పటాస్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. ఈ భామ పటాస్ షో తో పటాస్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీముఖి చాలా షోలు చేసినప్పటికీ పటాస్ లో యాంకర్ రవితో కలిసి వేసిన పంచ్ లకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తరవత బిగ్ బాస్ 3 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి తన ముక్కుసూటి తనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆంతే కాకుండా బిగ్ బాస్ 3 లో రన్నర్ గా నిలిచింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోను నటిస్తూ అలరిస్తోంది.

ప్రస్తుతం క్రేజీ అంకుల్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వక్చేందుకు రెడీ అవుతోంది. ఇక సినిమాలు, టీవీషోలతో బిజీగా ఉండే శ్రీముఖి సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలోనూ అభిమానులతో తన పర్సనల్ విషయాలు, కెరీర్ గురించి పంచుకుంటూ ఉంటుంది. కాగా   తాజాగా ఈ అమ్మడు చేసిన పోస్ట్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఫిబ్రవరి 14 న ఒక గ్రేట్ న్యూస్ చెబుతా అంటూ పోస్ట్ పెట్టింది. ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే ఆ రోజు గుడ్ న్యూస్ అంటే ప్రియుడిని పరిచయం చేస్తావా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు ప్రియుడిని పరిచయం చేస్తుందా..లేదంటే ఇంకేమైనా చెబుతుందా చూడాలి.

More Related Stories