English   

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో కీర్తి సురేష్ ప్రేమాయణం..త్వరలో పెళ్లి కూడా

 Keerthy Suresh
2021-02-13 12:27:02

మహానటి కీర్తి సురేష్ ప్రేమలో పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతునట్టు వార్తలు వస్తున్నాయి. అతను ఎవరో కాదు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమాయణం అని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఈ జంట ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే వీరిద్దరూ తమ పెళ్ళితేదీని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతునట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. 

ఇక వీరి పెళ్లి వార్తపై అటు కీర్తి సురేష్ అభిమానులు, ఇటు అనిరుద్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎప్పుడు పెళ్లిపై ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక కీర్తి, అనిరుద్ ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ "మహానటి" సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దాంతో తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోను సినిమాలు చేస్తుంది. ఇక అనిరుద్ విషయానికొస్తే చిన్న వయసులోనే ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. ఇటీవల విడుదలైన మాస్టర్ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఎంతో ప్లస్ అయ్యింది. మరోవైపు టాలీవుడ్ లో అజ్ఞాతవాసి, నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతం అందించాడు.

More Related Stories