English   

ఫస్ట్ డే కలెక్షన్ల ఉప్పెన

Uppena
2021-02-13 17:24:34

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా ఉప్పెన. ఈ సినిమా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందు వచ్చింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. ఇక సినిమా సక్సెస్ లో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి నటన...విజయ్ సేతుపతి నటవిశ్వరూపం భాగమయ్యాయి. దాంతో సినిమా పెరుకుతగ్గట్టుగానే కలెక్షన్ల ఉప్పెన వచ్చింది.  

సినిమా మొదటి రోజే 10.42 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఏరియా వైజ్ గా కలెక్షన్లు చూసుకుంటే నైజాంలో 3.08 కోట్లు, వైజాగ్ లో 1.43 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 0.98 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 0.81 కోట్లు, కృష్ణ జిల్లాలో 0.62 కోట్లు, గుంటూరులో 0.65 కోట్లు, నెల్లూరు 0.35 కోట్లు, టోటల్ ఆంధ్రా నుండి 4.87 కోట్ల షేర్ వసూలైంది. సీడెడ్ లో 1.35 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాం..ఆంధ్రా మొత్తం కలిపి 9.3 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక విదేశాల నుండి 34 లక్షలు, కర్ణాటక నుండి 52 లక్షలు...తమిళనాడు నుండి 16 లక్షల కలెక్షన్లను రాబట్టింది.   టోటల్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 10 కోట్లు వసూలు చేసింది.

More Related Stories