English   

చక్రతో డిస్టిబ్యూటర్ లు జాక్ పాట్ కొడతారు..విశాల్

Vishal Chakra
2021-02-13 20:52:56

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం "విశాల్ చ‌క్ర‌". శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక  ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 19న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న‌ సంద‌ర్భంగా హైదారాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో `విశాల్ చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`ని నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో `విశాల్ చ‌క్ర` మూవీ బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో..

యాక్ష‌న్ హీరో విశాల్ మాట్లాడుతూ  -  ``సాధార‌ణంగా నా సినిమా ఈవెంట్ అంటే చీఫ్ గెస్ట్‌ని పిలుస్తాను. ఇప్పుడు ఈ ఈవెంట్‌చూసి కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాకు ముందే ఎందుకు చెప్ప‌లేదు అని అడుగుతారు. కాని ఈ `చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`కి మీడియానే చీఫ్ గెస్ట్‌.  విశాల్ `చ‌క్ర` సినిమా ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాష‌ల‌తో పాటు హిందీలో కూడా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఎంఎస్ ఆనంద‌న్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి ఈ సినిమా తీశారు. త‌ప్ప‌కుండా ఆయ‌న‌కు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉంటుంది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రి బ్యాన‌ర్‌లో మ‌రో మంచి డైరెక్ట‌ర్‌ని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక‌పై కూడా మా బేన‌ర్ ద్వారా మంచి డైరెక్ట‌ర్స్‌ని, టెక్నీషియ‌న్స్  ఇంట్ర‌డ్యూస్ చేస్తాం. నా త‌మ్ముడు యువ‌న్ శంక‌ర్ రాజా ఎక్ట్రార్డిన‌రీ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా త‌మ్ముడు వ‌రంగ‌ల్‌ శ్రీ‌ను స‌హా ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అందరూ  ఈ సినిమాతో త‌ప్ప‌కుండా ఒక జాక్ పాట్ కొడ‌తారు. ఫిబ్ర‌వ‌రి20న అంద‌రం హ్యాపీఫేస్‌తో మీట్ అవుతాం. నా స్నేహితులు హీరో ర‌మ‌ణ‌, నంద చాలా హెల్ప్ చేశారు. అలాగే  మా అన్న‌య్య బి.ఎ రాజుగారికి ద‌న్య‌వాదాలు. నా ప్ర‌తి సినిమాకి  ఆయ‌న సొంత‌ సినిమాలాగా అన్నిద‌గ్గ‌రుండి చూసుకుంటారు. అలాగే చాలా మంది అడుగుతున్నారుస్ట్ర‌‌యిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని.. త‌ప్ప‌కుండా నెక్ట్స్ ఇయ‌ర్ ఉగాదికి  నా స్ట్ర‌యిట్ తెలుగు సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

More Related Stories