English   

రాధేశ్యామ్ టీజర్‌..  ప్రేమ కోసం చచ్చే టైప్‌ కాదు

Radhe Shyam
2021-02-14 16:47:54

ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ‘నువ్వు ఏమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని పూజా ప్రశ్నించగా.. ‘ఛ.. వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్‌ కాదు’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా మ్యూజిక్ ప‌రంగా చిత్ర యూనిట్ ఓ ఎక్స్‌పెరిమెంట్ చే్స్తుంది. అదేంటో తెలుసా? ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి హిందీ వెర్ష‌న్‌కు ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేస్తున్నారు. మిథున్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రెండు సినిమాలు, మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ ఒక పాట‌కు సంగీతాన్ని అందించారు. ఇక తెలుగు,తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ పాట‌ల‌కు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీతాన్ని అందిస్తాడ‌ట‌. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలనాటి నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

More Related Stories