English   

ఉప్పెన రెండు రోజుల కలెక్షన్స్..వసూళ్ల పండగ 

Uppena
2021-02-14 12:32:20

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రెండో రోజు కూడా ఎక్కడా తగ్గినట్లు కనిపించడం లేదు.  బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలేవీ లేకపోవడంతో కచ్చితంగా ఉప్పెన సేఫ్ జోన్‌కు రావడం కాదు లాభాలు కూడా తీసుకొచ్చేలా కనిపిస్తుంది. రెండ్రోజుల్లోనే ఈ సినిమాకు 18 కోట్ల షేర్ వచ్చింది. మరో 3కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్‌కు వెళ్లిపోనుంది. వీక్ డేస్ నుంచి ఉప్పెన ఎలా ఉండబోతుందనేది ఈ సినిమా హిట్ రేంజ్ డిసైడ్ చేయనుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. కొత్తమ్మాయి కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఈ సినిమా ఏరియా వైజ్ గా కలెక్షన్లు చూసుకుంటే నైజాంలో 5.75కోట్లు, వైజాగ్ లో 2.67 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో1.63 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1.13 కోట్లు, కృష్ణ జిల్లాలో 1.10 కోట్లు, గుంటూరులో 1.42 కోట్లు, నెల్లూరు 0.58 కోట్లు, సీడెడ్ లో 2.45 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాం..ఆంధ్రా మొత్తం కలిపి 16.73 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక విదేశాల నుండి  70 లక్షలు, కర్ణాటక నుండి 86 లక్షలు...తమిళనాడు నుండి 30 లక్షల కలెక్షన్లను రాబట్టింది.   టోటల్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 18 లక్షలు వసూలు చేసింది.

More Related Stories