English   

పక్కా కమర్షియల్ అంటున్న హీరో గోపీచంద్

Gopichand
2021-02-15 13:33:20

హీరో గోపీచంద్ డైరెక్టర్ మారుతి సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది ప్రొడక్షన్ హౌస్.  పక్కా కమర్షియల్ అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. ఈ పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ మార్చి 5వ తేదీ నుండి జరగనుందని డైరెక్టర్ మారుతి ప్రకటించారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపి సినిమాపై ఆసక్తిరేకెత్తించారు. జేక్స్‌బిజోయ్ సంగీతం సమకూర్చుతుండగా.. ఎస్‌కేఎన్ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్లడిస్తామని అంటోంది చిత్రయూనిట్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

More Related Stories