English   

మెగా మేనల్లుడు రికార్డ్.. ఉప్పెన మూడు రోజుల కలెక్షన్స్

Uppena
2021-02-15 14:00:57

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన కలెక్షన్లతో దుమ్మురేపుతోంది.  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపిస్తున్నాడు. ఆదివారం అందునా వేలంటైన్స్ డే కావడంతో.. ప్రేక్షకులు థియేటర్లకు క్యూకట్టారు. ఉప్పెన మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా 28కోట్లు షేర్ వసూళ్లు చేయడం విశేషం.  వీక్ డేస్ నుంచి ఉప్పెన ఎలా ఉండబోతుందనేది ఈ సినిమా హిట్ రేంజ్ డిసైడ్ చేయనుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. కొత్తమ్మాయి కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అయింది.  అలాగే తొలి సినిమాతోనే రికార్డు కలెక్షన్లు సాధించిన హీరోగా వైష్ణవ్ నిలిచాడు. ఈ రోజు `ఉప్పెన` దర్శకుడు బుచ్చిబాబు జన్మదినోత్సవం. ఈ సందర్భంగా `ఉప్పెన` నిర్మాణ సంస్థ రూ.50 కోట్ల పోస్టర్‌ను విడుదల చేసింది. 

3 𝐃𝐚𝐲𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 𝟐𝟖.𝟐𝟗𝐜𝐫 
Nizam8.53
Vizag 4.12
East 2.36
West 1.53
Krishna 1.76
Guntur 2.07
Nellore 86.4L
Ceded3.7

TG + AP - 24.97cr 

Overseas 1.2Cr
Karnataka 1.31Cr
Tamilnadu 48L
Rest of India 33L
Total - 3.32 cr

More Related Stories